teamVemuri

"తానా కొందరికే కాదు.. తెలుగు వారందరికీ" అని అంటున్న సతీష్ వేమూరి

అమెరికాలోని తెలుగు వారికి ఎనలేని సేవలనందిస్తున్నా తానాకు ఎన్నకల  సమయం దగ్గర పడింది. తానా కు గత రెండు దశాబ్దాలుగా ఎనలేని సేవలనందిస్తున్న సతీష్ వేమూరి ఈసారి ఎక్సుక్యూటివ్ వైస్  ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. టీం వేమూరి పేరుతో అనుభవజ్ఞులైన వారితో తన ప్యానల్ ను నిర్మించుకున్నారు. తానా లో పరిచయం అక్కర్లేని వ్యక్తి సతీష్ వేమూరి. ఈయన గతంలో వివిధ బాధ్యతల్లో తానాకు విశిష్ట సేవలందించి మంచి పేరు పొందారు. వాలంటీర్ గ తన ప్రస్థానం మొదలుపెట్టిన సతీష్ వేమూరికి 2011లో ఆయన చేసిన సేవలకుగాను బెస్ట్ వాలంటీర్ అవార్డు వరించింది. 2011-2013 లో టెక్నికల్ ట్రైనింగ్ కమిటీలో మెంబర్ గా ఉంది పైథాన్ ,డేటాబేస్ క్యాంప్స్ నిర్వహించారు. 2013-2015లో ట్రైనింగ్ కమిటీ ఛైర్మెన్ గా ఉంటూ వందలాదిమంది విద్యార్థులకు వెబ్సైట్ డిజైనింగ్  ట్రైనింగ్ నిర్వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రం చేసినందుకు ఆయన్ను ప్రసంశించారు. 2015-2017 లో కాలిఫోర్నియా RVP గా ఉంటూ 100కు పైగా ప్రోగ్రామ్స్ నిర్వహించి శబాష్ అనిపించుకున్నారు. ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించడంలో అయినా సతీష్ వేమూరి సాటి లేరని తానా సభ్యులు అంటుంటారు.

vemuri
team-vemuri

అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ట్రైనింగ్ మరియు CRT ట్రైనింగ్ ల వంటి బృత్తర కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించి ఎంతో మంది భవిష్యత్ లను తీర్చిదిద్దారు. మన ఊరి కోసం 5k రన్ మరియు ఎన్నో క్రీడా పోటీలను నిర్వహించి లక్షలాది డాలర్లను సేకరించి తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  తానా సంస్థ ద్వారా అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. తానా ఫండ్ రైసింగ్ కోసం దీంతానాను నిర్వహించి వేలాది డాలర్లను సేకరించారు. తానా సంఘం లో ఫండ్ రైసింగ్ అంటే మొదట గుర్తుకువచ్చే పేరు సతీష్ వేమూరి. విద్యార్థులకు  సైన్స్ పట్ల ఆశక్తి కలిగేలా ఒలంపియార్డ్ ప్రాజెక్టులను నిర్వహించి యువత భవితకు దిక్సూచై నిలిచారు.  అమెరికాలో ఉన్న మన తెలుగు వారి పిల్లలకు ఉపయోగపడేలా పేరంటల్  నెట్వర్కింగ్ ద్వారా మాట్రిమోనియల్ సైట్ స్థాపించి యువతకు మంచి భవిష్యత్ ను అందించేలా ప్రయత్నిస్తున్నారు.

గతంలో తానాకు ట్రెజరర్ గ ఉన్నప్పుడు అత్యంత పారదర్శకంగా వ్యవహరించి తెలుగు వారందరికీ చేరువయ్యారు.    తానా కోసం ఎంతో చేయాలనీ తపన ఉన్నా కొన్ని రాజకీయ శక్తుల వలన చేయాలనుకున్నది చేయాలేకాపోయారు. ప్రధానంగా తానా సంగం పై బయటి వ్యక్తుల ఆధిపత్యాన్ని అరికడతాం అంటున్నారు సతీష్ వేమూరి. తానాకు తన సర్వస్వము అర్పించడానికి సతీష్ వేమూరి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా  ఎన్నికల్లో ఓటు వేసి తనను మరియు తన ప్యానల్ టీం వేమూరిని గెలిపించాలని ఆయన తానా సభ్యులను కోరుతున్నారు.

భావి తరాల భవిష్యత్తే మా లక్ష్యం - సతీష్ వేమూరి

రాబోయే తానా ఎన్నికల్లో ఎక్సుక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు సతీష్ వేమూరి. ఎంతో అనుభవం మరియు పటిష్టమైన ప్యానల్ ను ఏర్పరుచుకున్నారు.  సతీష్ వేమూరి ప్యానల్ ప్రత్యేకత ఏంటంటే వీరికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా తానా బతుకమ్మా, తానా అన్నపూర్ణ, వేసవి శిబిరాలు మరియు తానా ఆదరణ , తానా చేయూత వంటి కార్యక్రమాలను  ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిర్వహించి వారి నిబద్ధతను చాటుకున్నారు.  టీం వేమూరి సభ్యులు రాబోయే తరాలను కూడా తానాకు అంకితమయ్యేలా చేయగలరని తానా సభ్యులలో ప్రగాఢ నమ్మకం ఏర్పడింది.

తానా సంఘంలో 33 వేలమంది సభ్యులు ఓటు హక్కు కలిగిఉన్నారని వారందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతున్నారు. మీ మద్దతు ఎంతో విలువైనదని, మీరు ఎన్నుకుంటే ప్రతీ  ఒక్కరికి జవాబుదారీతనంతో  వ్యవహరిస్తామని  సతీష్ వేమూరి ప్రకటించారు.  తానాను పటిష్టవంతం చేసేలా  మరియు బయటి శక్తుల ప్రభావం లేకుండా  చేయడానికి మాతో కలిసి రావాలంటూ తానా సబ్యులకు సతీష్ వేమూరి పిలుపునిచ్చారు.

తానా సంఘంలో 33 వేలమంది సభ్యులు ఓటు హక్కు కలిగిఉన్నారని వారందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతున్నారు. మీ మద్దతు ఎంతో విలువైనదని, మీరు ఎన్నుకుంటే ప్రతీ ఒక్కరికి జవాబుదారీతనంతో వ్యవహరిస్తామని సతీష్ వేమూరి ప్రకటించారు.  తానాను పటిష్టవంతం చేసేలా మరియు బయటి శక్తుల ప్రభావం లేకుండా చేయడానికి మాతో కలిసి రావాలంటూ తానా సబ్యులకు సతీష్ వేమూరి పిలుపునిచ్చారు.

సతీష్ వేమూరి విజనరీ మరియు సేవాగుణం తానాకు అత్యంత అవసరం...

అమెరికా వచ్చిన కొద్దినెలల్లోనే తానా వాలంటీర్ గా ప్రారంభమైన సతీష్ వేమూరి   చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్దత మరియు కఠోర  శ్రమతో విజయవంతం చేసేవారు. ఆయన చేసిన సేవలకు గాను 2011 లో బెస్ట్ వాలంటీర్ అవార్డు లభించింది. తన సౌమ్య గుణం మరియు సేవాతత్పరతతో తెలుగువారందరికి చేరువయ్యారు.  ఎందరో మహనీయుల దర్శకత్వంలో తానా సంఘం తెలుగు వారందరికీ మరియు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు మిక్కిలి కృషి చేయడం గర్వ కారణం. తానా సభ్యులందరి సహకారంతో ఇప్పటివరకు సతీష్ వేమూరి తానాలో అనేక పదవుల్లో పని చేసి ఆయన చేసిన పదవులకి వన్నె తెచ్చేవిధంగా కృషి చేశారు. ఏఈ ఎన్నికల్లో ఎక్సుక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సతీష్ వేమూరి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా తానా సంఘం పై బయటి వ్యక్తుల ఆధిపత్యాన్ని అరికడతాం అంటున్నారు సతీష్ వేమూరి. తానాకు తన సర్వస్వము అర్పించడానికి సతీష్ వేమూరి సిద్ధమయ్యారు.

46 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందించిన తానా సంస్థకు ఒక శాశ్వత భవనం లేకపోవడం చాలా భాదాకరమని అన్నారు.  ఈ ఎన్నికల్లో గెలిస్తే తానా శాశ్వత భావన కోసం ఫండ్ రైసింగ్ చేసిన తరువాతే పదవిని స్వీకరిస్తానై భహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా యువతకు  మరియు మహిళల అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించామని ప్రధానంగా యువత అభివృద్దే తానా యొక్క ప్రధాన ద్యేయమని చెప్పారు.  తరువాతి తరాలవారు తానాకు దూరమవుతున్నారని, యువతను మరియు పిల్లలను ఠాణాకు మరింత చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ట్రైనింగ్ మరియు CRT ట్రైనింగ్  వంటి బృహత్తర కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి ఎంతో మంది భవిష్యత్తులను తీర్చిదిద్దారు. గతంలో తానాకు ట్రెజరర్ గా ఉన్నప్పుడు అత్యంత పారదర్శకంగా వ్యవహరించి తెలుగు వారందరికీ చేరువయ్యారు.    తానా కోసం ఎంతో చేయాలనీ తపన ఉన్నా కొన్ని రాజకీయ శక్తుల వలన చేయాలనుకున్నది పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే తానాకు మరియు తెలుగు వారికి మరింత సేవచేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసి తనను మరియు తన ప్యానల్ టీం వేమూరిని గెలిపించాలని ఆయన తానా సభ్యులను కోరుతున్నారు.

పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒడిదుడుకులకులోనై అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి ప్రస్తుతం మరిన్ని ఉన్నత శిఖరాలు చేరిన తానా విజయ పధంలో ప్రముఖ నాయకులతో పాటు నా వంతు సహాయపడినందులకు మిక్కిలి సంతోషపడుతున్నాను. ఇదే సందర్భంలో కాలగమనంతో పాటు సమాజంలో మారుతున్న కొన్ని పరిస్థితులు, అనేక సంవత్సరాలుగా ఒకే వరవడిలో సాగిపోతే వచ్చే కొన్ని అలసత్వ లక్షణాలు, పెరుగుతూ వస్తున్న సంస్థ వెలపలి శక్తుల ప్రభావం కారణంగా మన ఈ తానా సంస్థ మనుగడ, నడవడిక ఆందోళనకరంగా మారుతున్నది. ఈ పరిస్థితి నుండి తానా బయట పడాలంటే పటిష్టమైన మరియు విజనరీ నాయకత్వం మిక్కిలి అవసరం.

వేగంగా మారుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో సభ్యులందరినీ కలుపుకొంటూ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా కార్యక్రమాలు రూపొందించుకొంటూ తానా సంస్థ మనుగడ మరియు భవిష్యత్తు ను బలపరచ గలిగిన నాయకత్వం మిక్కిలి అవసరం. అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పలు పదవుల ద్వారా సముపార్జించిన అనుభవము, అవగాహన మరియు విస్తృత పరిచయాల కారణంగా ఈ నాయకత్వం చేయగలనని దృడంగా భావిస్తూ ఎంతో మంది శ్రేయోభిలాషుల సలహాలు మరియు తోడ్పాటుతో ప్రస్తుత తానా ఎన్నికలలో నిర్వాహక ఉపాధ్యక్షుడు (Executive Vice President President Elect) గా పోటీ చేస్తున్నాను. మీ సహకారం మరియు ఓటు కొరకు సవినయంగా అర్ధిస్తున్నాను.

తానా ప్రస్తుత పరిపాలనా శైలిలో పలు సంస్కరణలు, విలువల పరిరక్షణ మరియు తెలుగు ప్రజలకు, భాషకు, సంస్కృతికి దోహదపడే పలు నూతన కార్యక్రమాలు నా భవిష్యత్ ప్రాధాన్యతలు. నా యొక్క గత అనుభవము, నిబద్ధత, నిర్వహణ సామర్ధ్యం లను బేరీజు వేసి మాకు ఓటు వేసి గెలిపించి తానా సంస్థను పరిరక్షిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలకై పాటుపడే అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. నిరంతరం మీకు సేవచేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటున్నాను… అంటూ సతీష్ వేమూరి  తానా సభ్యులకు సందేశం పంపారు.